ఉత్తమ ఫలితాలు సాధించాలి
భువనగిరి : ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. పదో తరగతి విద్యార్థుల కోసం జిల్లా విద్యాశాఖ రూపొందించిన స్టడీ మెటిరీయల్ కరదీపికను శనివారం తన చాంబర్‌లో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో 188 పాఠశాలలకు చెందిన 5,944 మంది విద్యార్థులకు ఇంగ్లిష్, హిండీ, తెలుగు సబ్జెక్టుల కరదీపికలను జిల్లా విద్యాశాఖ రూపొందించిందని, ఇందుకు అవసరమైన ఖర్చును దివీస్ కంపెనీ భరించడం ఆభినందనీయమన్నారు. ఇప్పటికే దివీస్ కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, ఏడీ ప్రశాంత్‌రెడ్డి, డీసీఈఎస్ సెక్రటరీ పాండునాయక్, ఏసీజీఈ రఘురాంరెడ్డి, బుక్ డిపో మేనేజర్ రంగారాజన్, ఎంఈఓలో నాగవర్థన్‌రెడ్డి, లక్ష్మీ, సెక్టోరల్ అధికారులు శ్రీనివాస్, రాధ,లింగారెడ్డి, నరహరి, ప్రధానోపాధ్యాయుడు రమేష్, దివీస్ కంపెనీ మాజమాన్యం కిషోర్‌కుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment