చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు కోసం ఆయా పాఠశాలల్లో రెండు వేల చదరపు గజాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంది. ఆ స్థలంలో ట్రాఫిక్ నిబంధనలు, సూచికలు, సిగ్నల్స్, బోర్డులతో కూడిన మ్యాప్‌లను కలర్లతో తీర్చదిద్దనున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ రూల్స్ చూపేందుకు అవసరమైన మిషనరీని వినియోగించాల్సి ఉంది. దీనికి ఒక్కో పార్క్ ఏర్పాటుకు సుమారు రూ.4లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు కూడా ఆయా పాఠశాలల యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా గ్రామాల్లో దాతల సహకారంతో తీసుకోవచ్చు. ఈ పార్క్‌ను పాఠశాలల్లో ఉండడం వల్ల ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పొందే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఆ విద్యార్థి పెరిగి పెద్దయిన తరువాత ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
పాఠశాలల్లో ‘చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్’
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలో అమలు
ఉమ్మడి జిల్లాలో 30కి పైగా పాఠశాలల్లో ఏర్పాటుకు సన్నాహాలు
రెండు వేల చదరపు గజాల స్థలం తప్పనిసరి..
Comments
Please login to add a commentAdd a comment