శ్రీవాణి విద్యాలయానికి 50 ఏళ్లు
ఉన్నత స్థానాల్లో పూర్వ విద్యార్థులు
శ్రీవాణి విద్యాలయంలో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో వందలాది మంది దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. 150 నుంచి 200 మంది వరకు అమెరికాలో ఉన్నారు. అమెరికాలోని ప్రముఖ సైన్స్ శాస్త్రవేత్త శ్రీవాణి విద్యాలయానికి చెందిన విద్యార్థి కావడం విశేషం. ఆయనతో పాటు పాటు పలువురు విద్యార్థులు ఐఏఎస్, డీస్పీలు, సీఐలు,ఎస్‌ఐలు, తహసీల్దార్లు, ఎండీడీఓలు, ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా పని చేస్తున్నారు. భారత్ సైన్యంలోనూ వివిధ హోదాల్లో ఉన్నారు. అంతేకాకుండా ప్రముఖ వ్యాపారులుగా, జిల్లా, రాష్ట్రస్థాయిలో రాజకీయ నేతలుగా ఎదిగారు.
భువనగిరి : జిల్లా కేంద్రంలోని శ్రీవాణి విద్యాలయం స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమైంది. 1974లో స్థాపించిన ఈ పాఠశాలకు ఈనెల 18వ తేదీతో 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు పాఠశాల యాజమాన్యం ఏర్పాట్లు చేసంది. స్థానిక సాయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించే వేడుకలకు సుమారు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు హాజరుకానున్నారు.
20వేల మందికి పైగా విద్య
ఇప్పటివరకు 20వేల మందికి పైగా విద్యార్థులు శ్రీవాణి విద్యాలయంలో విద్యనభ్యసించారు. పాఠశాల నిర్వహణ తీరును గుర్తించి అప్పట్లో ఎయిడెడ్ స్కూల్‌గా ప్రభుత్వం గుర్తించింది. దాదాపు పదేళ్ల పాటు ఎయిడెడ్ పాఠశాలగా కొనసాగింది. ఆతరువాత కొందరు ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపడంతో రెండేళ్ల పాటు శ్రీవాణి విద్యాలయం మూతపడింది. పాఠశాల సమితి, పూర్వ విద్యార్థులు సంఘం సహకారంతో రెండేళ్ల క్రితం పాఠశాల తిరిగి పునఃప్రారంభమైంది. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పాఠశాల సమితి, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ రాజేశ్‌చంద్రతో పాటు మరికొందరు ఉన్నతాధికారులు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఫ నేడు స్వర్ణోత్సవ వేడుకలు
ఫ హాజరుకానున్న వెయ్యిమంది పూర్వ విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment