సాక్షి,యాదాద్రి : గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం మినీ మీటింగ్ హాల్‌లో అన్ని శాఖల అధికారులతో గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు నిర్వహించనున్నందున వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రాహుల్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ శోభారాణి, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ హనుమంతరావు
Comments
Please login to add a commentAdd a comment