అండర్ పాస్ నిర్మించాలని ధర్నా
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని ఐటీఐ వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ పాల్గొని మాట్లాడుతూ భువనగిరి ప్రభుత్వ ఐటీఐ దగ్గర నేషనల్ హైవే దాటడానికి రామకృష్ణాపురం, పెంచికల్ పహాడ్‌తోపాటు నాలుగు మండలాలకు చెందిన 40 గ్రామాలకు పైగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయారని, 80 మందికి పైగా గాయపడి దివ్యాంగులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు దయ్యాల నర్సింహ, అండర్ పాస్ నిర్మాణ సాధన కమిటీ కన్వీనర్ సిల్వేరు ఎల్లయ్య, కో కన్వీనర్లు మందడి సిద్ధారెడ్డి, కంచి మల్లయ్య, సిల్వేరు మధు, కళ్లెం సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జనగాం పాండు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, సీపీఎం భువనగిరి పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణ, అబ్బగాని వెంకటేశం, భువనగిరి మండలం మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment