బీఆర్‌ఎస్‌కు భయపడే రైతు దీక్షకు అనుమతివ్వలేదు
యాదగిరిగుట్ట: రైతుల కోసం బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడి నల్లగొండలో మంగళవారం నిర్వహించనున్న కేటీఆర్ రైతు దీక్షకు అనుమతులు ఇవ్వలేదని మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట బీఆర్‌ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు ఇచ్చిన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని కుట్రలు చేసినా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఖలీల్, గంగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, పాపట్ల నరహరి, కసావు శ్రీనివాస్‌గౌడ్, మిట్ట వెంకటయ్య, ముక్కెర్ల సతీష్, సంపత్ తదితరులున్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి
సునితామహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment