సర్వే పారదర్శకంగా చేపట్టాలి
బీబీనగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందేలా పారదర్శకంగా సర్వే చేపట్టాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితారామచంద్రన్ అన్నారు. బీబీనగర్ మండలంలోని మహదేవ్‌పురం, మక్తా అనంతారం గ్రామాల్లో కొనసాగుతున్న రైతు భరోసా, రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సోమవారం కలెక్టర్ హనుమంతరావుతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువులో మునిగి ఉన్న భూములకు రైతు భరోసా వర్తింప చేయవద్దని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని అధికారులకు సూచించారు. వెంచర్లు, గుట్టలు కలిగి ఉన్న భూములను రైతు భరోసా పథకం నుంచి తొలగించనున్నట్లు తెలిపారు. తప్పిదాలకు తావు లేకుండా సర్వే విషయాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆమె వెంట జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, సివిల్ సప్లయ్ అధికారి వనజాత, మండల ప్రత్యేకాధికారి సుభాషిణి ఉన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి అనితారామచంద్రన్
Comments
Please login to add a commentAdd a comment