– నేత్రదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం
పులివెందుల టౌన్ : వైఎస్ కుటుంబ సమీప బంధువైన చవ్వా వెంకటసుబ్బారెడ్డి(90) సోమవారం అనారోగ్యంతో మృతి చెందా డు. ఆయన మృతి చెందిన విషయం తెలుసు కున్న వైఎస్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, సతీమణి వైఎస్ ప్రమీలమ్మలు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో కార్నియాలను సేకరించి నేత్రదానం చేశారు. సి.వి.సుబ్బారెడ్డి సతీమణి వేదామని, కుమారుడు విజయ్‌శేఖర్‌రెడ్డి, కుమార్తె వైఎస్ ప్రమీలమ్మ, కోడళ్లు సులోచన, సు నీత, అల్లుడు వైఎస్ మనోహర్‌రెడ్డి, మన వళ్లు జగదీష్‌రెడ్డి, దుష్యంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి, మనవరాలు అని త, మధులిఖలు నేత్రదానానికి అంగీకరించడంతో స్నేహితఅమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజు కార్నియాలను సేకరించి నేత్రనిధి కి పంపించారు. వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, పలువురు సుబ్బారెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. సాయంత్రం సుబ్బారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సేవా సమితి పట్టణ అధ్యక్షులు మహమ్మద్ రఫి, తదితరులు పాల్గొన్నారు.
నలుగురు మట్కా బీటర్లు అరెస్ట్
– రూ. 60,000 నగదు, మట్కా స్లిప్‌లు సీజ్
కడప అర్బన్ : మట్కా మహమ్మారి జోలికి ఎవరైనా వెళితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్.వి నాగరాజు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎం.డి షరీఫ్ ఆధ్వర్యంలో కడప ఒన్‌టౌన్ సీఐ ఎన్.వి నాగరాజు తమ సిబ్బందితో కలిసి మట్కా బీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచారు. సోమవారం సీఐ నాగరాజు తమకు అందిన పక్కా సమాచారంతో కృష్ణ, రమేష్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో మట్కా రాస్తున్న నలుగురు బీటర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60,000 నగదుతో పాటు, 8 మట్కా స్లిప్‌లు, 4 బాల్‌పెన్నులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన షేక్ మహబూబ్ బాషా, వై.వీ స్ట్రీట్‌కు చెందిన సుంకేసుల శ్రీరాములు, కుమ్మరకుంట వీధికి చెందిన పఠాన్ షఫీవుల్లా ఖాన్, రాధాకృష్ణనగర్‌కు చెందిన షేక్ మదార్‌బాషా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment