![కలశాలను తీసుకొస్తున్న గడికోట మోహన్‌రెడ్డి,
శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/11/10rct51-170016_mr_0.jpg.webp?itok=QTm6zwOR)
కలశాలను తీసుకొస్తున్న గడికోట మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు
రాయచోటి టౌన్: దక్షిణ కాశీగా వెలుగొందుతున్న రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ పశ్చిమ రాజగోపుర కలశప్రతిష్టను ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు మఠం పరమేశ్వరస్వామి, పురోహితుల ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ గోపురంపైకి ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ పాలక మండలి అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయ, ఈవో డీవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోలంరెడ్డి దశరథరామిరెడ్డిలు వెళ్లి కలశస్థాపన చేశారు. లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి సతీసమేతంగా, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సతీమణి గడికోట లలితారెడ్డి కలశ ప్రతిష్ట పూజలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment