తిరుమలకు ఆకేపాటి పాదయాత్ర ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

తిరుమలకు ఆకేపాటి పాదయాత్ర ప్రారంభం

Published Sat, Dec 16 2023 1:26 AM | Last Updated on Sat, Dec 16 2023 1:26 AM

రాజంపేటలో ఆకేపాటి అమరనాథరెడ్డి పాదయాత్ర దృశ్యం  - Sakshi

రాజంపేటలో ఆకేపాటి అమరనాథరెడ్డి పాదయాత్ర దృశ్యం

రాజంపేట: జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి తిరుమలకు అన్నమయ్య కాలిబాటలో 21వ సారి మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సాయంత్రం ఆకేపాడు ఆలయాల నుంచి ప్రారంభించారు. ఆయన వెంట గోవింద భక్తులు శ్రీ వెంకటేశ్వరస్వామిపై కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ఆకేపాటి సోదరుడు ఆకేపాటి అనిల్‌రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర కొనసాగింది. కోలాటలు, భజనలు, గోవింద నామస్మరణతో మార్మోగింది. అన్నమయ్య కీర్తనలతో ఆద్యంతం భక్తిభావంతో కొనసాగింది. ఉత్సాహ భరితంగా బాణసంచాలు కాల్చారు.

శ్రీనివాసుని ఊరేగింపు: పాదయాత్రలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఊరేగింపు చేపట్టారు. పాదయాత్ర పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత పండరి భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ తనయుడు కొండూరు విజయ్‌రెడ్డి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి బావమరిది మదన్‌రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.

పాదయాత్ర సాగిందిలా..

రాజంపేట పట్టణంలోని మార్కెట్‌ సర్కిల్‌, పాతబస్టాండు సర్కిల్‌లో ఆకేపాటిని పలువురు గజమాలతో సత్కరించారు. ఏఐటీఎస్‌ సర్కిల్‌లో ఏఐటీఎస్‌ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఎంజీపురంలో సీనియర్‌ న్యాయవాది కొండూరు శరత్‌కుమార్‌రాజు, యల్లమ్మగుడి వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ పోలా శ్రీనివాసులరెడ్డి, కాకతీయ విద్యా సంస్థల అధినేత పోలా రమణారెడ్డి, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీసీ యోగీశ్వరరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మర్రిరవి, కౌన్సిలర్లు కూండ్ల రమణారెడ్డి, రాము యాదవ్‌, టీటీడీ చైర్మన్‌ సోదరుడు భూమన శంకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, గోపిరెడ్డి, అరిగెమణి, భాస్కర్‌రాజు, సౌమిత్రి, విశ్వనాథరాజు, జెడ్పీటీసీలు గడికోట ఉషాసుబ్బారెడ్డి, దాసరి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

పూర్వజన్మ సుకృతం

21వ సారి అన్నమయ్య కాలిబాటలో నడిచి శ్రీవారి దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అన్నమయ్య కాలిబాట అభివృద్ధికి బీజం పడింది. సీఎం వైఎస్‌ జగన్‌కు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తున్నాను. –ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement