వైఎస్సార్ సీపీకి పూర్వ వైభవం తేవాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. నగర అధ్యక్షుడిగా నియమితులైన అంజద్ బాషాను ఆదివారం వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకుడు మున్నా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరూన్ బాబు, ఇస్మాయిల్, జఫ్రుల్లా, జాకీర్, ఖాదర్బాషా, హనీఫ్, అల్తాఫ్ ,చోటా తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment