క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ హాకీ అధ్యక్షులు బిఎం.చాణుక్యరాజ్ అన్నారు. ఆదివారం అన్నమయ్య మదనపల్లె బీటీ కాలేజీ బిసెంట్ హాలులో 14వ ఏపీ సబ్ జూనియర్ బాలుర హాకీ రాష్ట్ర స్థాయి పోటీలు ముగింపు కార్యక్రమం జరిగింది.విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ ప్రదానోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనడం ముఖ్యమని గెలుపు,ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు. ఈ పోటీలకు రాష్ట్రం వ్యాప్తంగా 22 జిల్లాల నుంచి జట్లు పోటీల్లో పాల్గొన్నాయన్నారు. కార్యక్రమంలో టౌన్‌బ్యాంకు చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఏపీ హాకీ కోశాధికారి పి.థామస్, టోర్నమెంట్ డైరెక్టర్ రాజశేఖర్, ది అన్నమయ్య హాకీ జిల్లా అధ్యక్షులు పి.వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివప్రసాద్, కోశాధికారి పి.ప్రసాద్‌రెడ్డి, కన్వీనర్ హితేష్‌రావు, కోచ్ నౌషాద్, పీడీ జలజ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి విజేత వైఎస్సార్ జిల్లా జట్టు:
14వ ఏపీ సబ్ జూనియర్ బాలుర రాష్ట్ర స్థాయి హాకీ ఛాంపియన్ షిప్ ఫైనల్లో వైఎస్సార్ జిల్లా జట్టు– అనకాపల్లి జిల్లా జట్టుపై 2–1 స్కోరుతో విజయం సాధించి ట్రోఫీ కై వసం చేసుకుంది.రన్నర్స్‌గా అనకాపల్లి జిల్లా, తృతీయ స్థానం తిరుపతి జిల్లా జట్టు నిలిచింది. నాల్గవ స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment