కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం
కడప కోటిరెడ్డిసర్కిల్: రైల్వేశాఖలో పనిచేస్తున్న కార్మికులకు అండగా ఉంటామని, వారి సమస్యలను తమవంతుగా కృషి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన్ అధ్యక్షులు డీఎం బాషా, అడిషనల్ డివిజన్ సెక్రటరీ మధుసూదన్‌రావు తెలిపారు. ఆదివారం దక్షిణ మధ్య రైల్వే యూనియన్ కడప యూనియన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ కృషి చేస్తుందని వివరించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ కడప బ్రాంచ్ సెక్రటరీగా ఎం.రవికుమార్, వైస్ చైర్మన్‌గా రాజేష్‌కుమార్, సహాయ కార్యదర్శులుగా వెంకటేశ్వరరెడ్డి, అనిల్‌కుమార్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కడప బ్రాంచ్ చైర్మన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment