No Headline
కడప కల్చరల్: వేమన పద్యాలు సాధారణమైనవి కావని, సమాజానికి పాఠాలు నేర్పేశక్తి కలిగినవని కడప రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ కుప్పిరెడ్డి నాగిరెడ్డి అన్నారు. వేమన జయంతి సందర్భంగా ఆదివారం కడప రాజీవ్ మార్గ్‌లో ఉన్న వేమన విగ్రహానికి రెడ్డి సేవా సమితి కార్యవర్గం పూలమాలలు వేసి నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన నాటి సమాజంలో స్పృశించని అంశం అంటూ లేదని, ప్రతి రంగాన్ని అవగాహన చేసుకున్నాకే ఆయన పరిశీలించి సులభమైన పద్యాల ద్వారా ప్రజలకు బోఽధించారన్నారు. ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ కడప పట్టణంలో రెడ్డి సేవా సమితి ద్వారా వేమన విగ్రహాన్ని నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వైఎస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ వేమన సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పారన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల ప్రతినిధులు కూడా వేమన విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఆయన పట్ల తమకు గల గౌరవాన్ని చాటుకున్నారు. రెడ్డి సేవా సమితి కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎం రామకృష్ణారెడ్డి, యోగి వేమన విశ్వవిద్యాలయం సహ ఆచార్యులు కొవ్వూరు రామసుబ్బారెడ్డి, శివ శంకర రెడ్డి, ఓవి రెడ్డి, వెంకటరెడ్డి,రమేష్ రెడ్డి,ఎం సుబ్బిరెడ్డి, మధుసూదన రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, శివన్నారాయణ రెడ్డి, పద్మప్రియ చంద్రా రెడ్డి, సూర్య రెడ్డి, కృష్ణారెడ్డి, దేవిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, డాక్టర్ రంగనాథరెడ్డి, రెడ్డి హాస్టల్ విద్యార్థినిలు, సాహితీ మిత్రులు, వేమన అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment