వేమన పద్యాలు... సమాజానికి పాఠాలు
● ● ఎకరాలకు 2 నుంచి 5 క్వింటాళ్లు...
● సాగు ఖర్చులు కూడా రాక మినుము రైతు కుదేలు
● అధిక వర్షాలతో చుట్టుముట్టిన చీడపీడలు
● తగ్గిన మినుము ధర.. ఆందోళనలో రైతులు
కడప అగ్రికల్చర్: కోటి ఆశలతో ఆరుతడి పంటగా మినుము సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. అధిక వర్షాలకు తోడు చీడపీడలు చుట్టుముట్టడంతో దిగుబడి తగ్గింది. గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా ధరలు కూడా తగ్గడంతో రైతుల్లో దిగులు మొదలైంది.
● జిల్లాలో ఈ ఏడాది ఆరుతడి పంటల కింద మినుముపంట ఆశాజనకంగా సాగయింది. జిల్లాలో సాధారణసాగు 14,731 హెక్టార్లుకాగా ఈ ఏడాది 16,063 హెక్టార్లలో సాగైంది. సాధారణ సాగుకంటే 1332 హెక్టార్ల అధిక విస్తీర్ణంలో మినుముపంట సాగయింది. సాగు చేసిన తొలినాళ్లల్లో పంట చాలా ఏపుగా బాగా వచ్చింది. జిల్లాలో పెండ్లిమర్రి, కమలాపురం, ఎర్రగుంట్ల, వీఎన్‌పల్లి, పెద్దముడియం, లింగాల, ఖాజీపేటలతో పలు మండలాల్లో సాధారణ సాగుకుంటే అదిక విస్తీర్ణంలో మినుముపంట సాగయింది.
ఎడతెరిపిలేని వర్షాలతో...
ఈ ఏడాది రబీలో రెగ్యులర్ తుఫాన్‌ల కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఫలితంగా చీడపీడల బెడద అధికమై పంట తెగుళ్ల బారిన పడింది. దీంతో రైతులు వేలకు వేలు ఖర్చు పెట్టి పురుగుముందులను పిచికారి చేశారు. అయినా పంట చోతి కొచ్చే సమయానికి దిగుబడి బాగా తగ్గిందని పలువురు రైతులు వాపోయారు. సాగు ఖర్చులు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా పంట బాగా
పండితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఎకరాకు రెండు నుంచి ఐదు క్వింటాళ్లకే పడిపోయిందని రైతులు తెలిపారు. ఎకరా మినుముపంట సాగుకు సేద్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుముందులు కలిసి 25 నుంచి 30 వేల మేర ఖర్చు వస్తుంది. దిగుబడి చూస్తే దారుణంగా తగ్గిపోయింది. పంట దిగుబడి ప్రారంభంలో గింజల నాణ్యతను బట్టి క్వింటాల్ 9 నుంచి 10 వేల వరకు ధర పలికిందని రైతులు తెలిపారు. అ తర్వాత తెగుళ్లతో గింజ నాణ్యత తగ్గిడంతో ప్రస్తుతం క్వింటాల్ రూ. 7 వేల నుంచి రూ. 7500 ధర మాత్రమే పలుకుతోందని పలువురు మినుము రైతులు తెలిపారు. ఈ లెక్కన చూస్తే సాగు ఖర్చులు కూడా అందేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
బరువుగా ఖర్చులు వచ్చాయి
నేను రెండు ఎకరాల్లో మినుముపంటను సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయానికి తెగుళ్లు సోకాయి. దీంతో ఎకరాకు నాలుగు క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. నాలుగు క్వింటాళ్ల దిగుబడితో ఆడికాడికి సాగు ఖర్చులు వచ్చాయి. ఈసారి మినుముపంటతో ఏం లాభం లేదు. – దుగ్గిరెడ్డి. కొండారెడ్డి,
రైతు, సుంకేసుల, ఖాజీపేట మండలం
ప్రభుత్వం ఆదుకోవాలి
మినుము సాగు చేసిన రైతులకు సాగు ఖర్చులు కూడా రాలేదు. అధిక వర్షాలతో ఈ ఏడాది మినుముపంటకు తెగుళ్ల సోకాయి. దీంతో దిగుబడి బాగా తగ్గింది. కొన్ని చోట్ల ఎకరాకు రెండు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. పంట దెబ్బతిన్న మినుము రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – దస్తగిరిరెడ్డి,
ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.
Comments
Please login to add a commentAdd a comment