ఘనంగా యోగి వేమన జయంతి
లింగాల : ప్రజాకవి యోగివేమన జయంతిని రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ (ఆర్సీడీఎస్) ఆధ్వర్యంలో లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో ఉన్న లీలావతి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీడీఎస్ అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, సొసైటీ ప్రతినిధులు యోగి వేమన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు తినిపించారు. ఈ సందర్భంగా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజాకవి, తాత్వికుడు యోగివేమన అన్నారు. తేలికై న పదాలతో అనుభవాలకు అక్షర రూపం కల్పించి అలవోకగా ఆట వెలదిలో పద్యాలను రచించి పండిత పామరులను మెప్పించారన్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆర్సీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకట సర్వోత్తమ్ రెడ్డి, సొసైటీ రాష్ట్ర కార్యదర్శులు ఎద్దుల అర్జున్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, లీలావతి వృద్ధాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి, రెడ్డి ప్రముఖులు పుష్పనాథ రెడ్డి, చప్పిడి కృష్ణారెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రసూల్, రఘునాథరెడ్డి, మౌళి, బండి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment