జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట కాలనీలో నివాసం ఉంటున్న లక్ష్మీ ప్రసన్న (32) అనే వివాహిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ సీఐ ఎస్.లింగప్ప కథనం మేరకు.. లక్ష్మీ ప్రసన్న తన హరి కిరణ్ శర్మతో కలిసి గత కొంత కాలం నుంచి నాగలకట్ట కాలనీలో కాపురం ఉంటున్నారు. ఆమె భర్త కాలనీలో ఉన్న శ్రీ చౌడేశ్వరి ఆలయంలో పూజారిగా ఉన్నాడు. వీరి మధ్య తరచూ కలహాలు జరిగేవి. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం అర్థరాత్రి ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చి గమనించిన భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటో –కారు ఢీ
వల్లూరు (చెన్నూరు) : చెన్నూరు మండలం స్థానిక గోపవరం క్రాస్ శ్యామలాదేవి గుడి వద్ద ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చెన్నూరు మండలం గోపవరానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. సీఐ పురుషోత్తం రాజు ప్రమాదానికి కారణమైన కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శతాధిక వృద్ధురాలి మృతి
పీలేరు : మండలంలోని యల్లమంద పంచాయతీ నగిరికి చెందిన వీరనాగమ్మ నాయకురాలు (115) అనే శతాధిక వృద్ధురాలు శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment