పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు | - | Sakshi
Sakshi News home page

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

Published Mon, Jan 20 2025 12:32 AM | Last Updated on Mon, Jan 20 2025 12:33 AM

పేదిం

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

చిన్నారులు..హాకీలో చిరుతలు రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ

వీరంతా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. సర్కారుబడుల్లో చదువుతున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మదనపల్లెలో జరిగిన ఏపీ సబ్‌ జూనియర్‌ హాకీ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఫైనల్లో విజేతలుగా నిలిచారు. తమ సత్తాను చాటి ఛాంపియన్‌ ట్రోఫీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో హాకీ క్రీడలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారుల గురించి కథనం. –మదనపల్లె సిటీ

పూర్వ వైభవం తెస్తా...

నా పేరు కె.సంతోష్‌కుమార్‌. తల్లిదండ్రులు రాంప్రసాద్‌, మాధవి, వైఎస్సార్‌ స్పోర్ట్సు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. నాన్న ఆటో డ్రైవర్‌. గత రెండు సంవత్సరాలుగా హాకీలో రాణిస్తున్నా. ఛండీగడ్‌, కేరళ, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాను. హాకీకి పూర్వ వైభవం తెస్తా.

ప్రతిభ చాటి..లక్ష్యాన్ని చేరుకుని..

నా పేరు నాగభవానీ శంకర్‌. డాక్టర్‌ వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. నాన్న సాయిప్రతాప్‌, అమ్మ నాగమల్లేశ్వరి. నాన్న అంబులెన్స్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. ఇందుకు అమ్మానాన్నలు ప్రోత్సహించారు. మూడు సంవత్సరాల నుంచి హీకీ ఆడుతున్నా. గోల్‌ కీపర్‌గా కీలకంగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఛండీగడ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, పూణేలలో జరిగిన హాకీ ఛాంపియన్‌ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచా. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నదే తన ధ్యేయం.

ఆట తీరులో మెప్పించి ..

చోటు సాధించి...

నా పేరు గంగా చైతన్య. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు రమాదేవి, గంగాధర్‌. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా హాకీ ఆడుతున్నా. ఖేల్‌ ఇండియాలో శిక్షణ తీసుకున్నా. ఆటలో తన ప్రతిభను గుర్తించి పీడీ రవికుమార్‌ ప్రోత్సహించారు. ఛండీగడ్‌, కేరళ, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నా. హాకీలో మంచి గుర్తింపు తీసుకువస్తా.

హాకీ క్రీడపై ఇష్టంతో...

నా పేరు ఎం.బాలాజీ. తల్లిడండ్రులు ఎం.వెంకటసుబ్బయ్య, నరసమ్మ. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. తండ్రి మేసీ్త్ర పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. హాకీ క్రీడ అంటే ఎంతో ఇష్టం. కోచ్‌ల సహకారంతో గత రెండు సంవత్సరాలుగా హాకీ పోటీల్లో పాల్గొంటున్నా. పూణే, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొ న్నా. హాకీ క్రీడకు గుర్తింపు తెస్తా.

తల్లిదండ్రుల

ప్రోత్సాహంతో...

నా పేరు పి.బాలాజీ. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు నాగకవిత, రామమోహన్‌. తండ్రి చిరు వ్యాపారి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి పెరిగింది. స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశం లభించింది. ఇక్కడ హాకీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఛండీగడ్‌, పుణే, కేరళ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ స్థాయిలో పాల్గొన్నా. హాకీలో మంచి క్రీడాకారుడిగా పేరు తెస్తా.

కోచ్‌ల సహకారంతో..

నా పేరు ఎస్‌.జాకీర్‌హుస్సేన్‌. వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. తల్లిదండ్రులు సబీరాబీ, వలిబాషా. తండ్రి కండక్టర్‌గా పని చేస్తున్నారు. క్రీడల్లో రాణించి స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరా. పాఠశాలలో కోచ్‌ల సహకారంతో గత మూడు సంవత్సరాల నుంచి హాకీలో రాణిస్తున్నా. పూణే, మధ్యప్రదేశ్‌, కేరళ, ఛండీగడ్‌ రాష్ట్రాలో జరిగిన జాతీయ స్థాయి పోటీతల్లో పాల్గొన్నా.ఇండియాకు ఉన్న హాకీ పేరు నిలబెడుతా.

No comments yet. Be the first to comment!
Add a comment
పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 1
1/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 2
2/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 3
3/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 4
4/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 5
5/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు 6
6/6

పేదింటి కిరణాలు.. క్రీడా కెరటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement