జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీన చెల్లించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ కోరారు. కడప నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో ఆదివారం ఏపీ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘరామనాయుడు, జిల్లా కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కృష్ణప్రసాద్, జిల్లా ట్రెజరర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment