సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న ప్రజాప్రతినిధులు
కడప కార్పొరేషన్: శ్రీ సత్యసాయి జిల్లా పాల సముద్రంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటనలో పాల్గొనేందుకు గన్నవరం నుంచి విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 1.05 గంటలకు వచ్చిన సీఎంకు డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, శాసన మండలి వైస్ చైర్మన్ జకియా ఖానం, కలెక్టర్ విజయరామరాజు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఉద్యాన శాఖ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన్‌లు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
● అనంతరం పర్యటన ముగించుకొని సాయంత్రం 6.23 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, కలెక్టర్ విజయరామరాజు, డీఐజీ సెంథిల్ కుమార్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment