ఈ–కామర్స్ వైపు ప్రోత్సహించాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ–కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతోపాటు సంపూర్ణ సాధికారిత సాధించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో డీఆర్‌డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ రకాల పనుల పురోగతిపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలో జరుగుతున్న మహిళాభివృద్ధి, సంకేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. జిల్లాలో పేదరిక నిర్మూలన, మహిళా అభివృద్ధి, సాధికారిత, పొదుపు సంఘాల బలోపేతంతోనే సాధ్యం అవుతుందన్నారు. సామాజిక భద్రతలో భాగంగా.. వృద్ధాప్య మహిళా సంఘాలను ఏర్పాటు చేసి.. ఆయా సంఘాల పటిష్టతకు కృషి చేయాలన్నారు. ప్రతి మండలం నుంచి చురుకుగా ఉన్న స్వయం సహాయక గ్రూపులను గుర్తించి వారిని ఈ కామర్స్ బిజినెస్‌లోకి అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలన్నారు. అంతేకాకుండా వారికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు సరైన శిక్షణను అందివ్వాలన్నారు. జిల్లాలో అర్హతలు కలిగిన అన్ని స్వయం సహాయక సంఘాలకు రానున్న నాలుగు నెలల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు కొత్త రుణాలను రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. సభ్యులందరికీ పెన్షన్లు, ఆరోగ్యశ్రీ కార్డులు, నివాస గృహాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు పలు అంశాలపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పీడీలు ఆనంద్ నాయక్, సురేష్ రెడ్డి, జోయల్ విజయ్ కుమార్ లతో పాటు డీపీఎంలు, ఏపీడీలు, మెప్మా సి.ఎం.ఎం.లు, సెర్ప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో
జిల్లా కలెక్టర్ శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment