ఉత్సాహంగా ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
కడప స్పోర్ట్స్: కడప నగరంలోని డీఎస్‌ఏ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ తుదిదశకు చేరుకుంది. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన ఎంపికల ప్రక్రియ 5వ రోజు గురువారం కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన అభ్యర్థులకు తొలుత రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం పరుగు పందెం, పుల్లప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్స్, లాంగ్‌జంప్, హైంజప్ నిర్వహించారు. ఎంపికల ప్రక్రియను ఆర్మీ రిక్రూట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ పునీత్‌కుమార్ పర్యవేక్షించారు.
కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో రెండురోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా గురు వారం ఒంటిమిట్టలో అత్యధికంగా 15.8 మి.మీ వర్షం కురవగా అత్యల్పంగా సింహాద్రిపురంలో 0.4 నమోదయింది. అలాగే బద్వేల్‌లో 14.6, సిద్దవటంలో 12.4, కలసపాడులో 8.4 , అట్లూరులో 8, కాశినాయనలో 7.2 , గోపవరంలో 5.6, సికెదిన్నెలో 4.8 , ఖాజీపేటలో 3.6 , కడపలో 3 , బి. కోడూరులో 1.8 , పోరుమామిళ్లలో 1.6 , బిమఠం, ఎర్రగుంట్ల, కొండాపురం, పొద్దుటూరు. వల్లూరులలో 1.4, చెన్నూ రు, మైదుకూరు, చాపాడులలో 1.2 , సింహాద్రిపురంలో 0.4 మి.మీ నమోదయింది.
Comments
Please login to add a commentAdd a comment