నేడు ధ్రువపత్రాలతో హాజరుకావాలి
కడప ఎడ్యుకేషన్: కడప నగరపాలక పరిధిలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లకు పాఠశాల సహాయకులుగా పదోన్నతులకు సంబంధించి ఉమ్మడి సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. ఆయా సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు తమ ఒరిజినల్ విద్యార్హతల ధ్రువపత్రాలతోపాటు సేవా పుస్తకంలో 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్దకు వ్యక్తిగతంగా హాజరై తమ విద్యార్హతలు, సేవా పుస్తకాలను వెరిఫై చేయించుకోవాలని డీఈఓ మీనాక్షి తెలియచేశారు.
రేపు వైవీయూలో
‘యువ ఉత్సవ్’
వైవీయూ: భారత ప్రభుత్వం యువజన సర్వీసులశాఖ మార్గదర్శనంలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 16న యోగివేమన విశ్వవిద్యాలయంలో ‘యువ ఉత్సవ్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నెహ్రూ యువకేంద్రం అధికారి మణికంఠ తెలిపారు. 15 నుంచి 29 ఏళ్లలోపు గల యువత ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ‘ఇండియా–2047’ అంశంపై పెయింటింగ్, కవిత్వం, మైబైల్ ఫొటోగ్రఫీ, డిక్లేమసిన్ విభాగాలలో వక్తృత్వ పోటీలు, కల్చరల్, ట్రెడిష నల్, ఫోక్, సైన్స్ మేళా సింగిల్ గ్రూప్ ఫొటోలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 80088 19556 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఎల్‌ఎల్‌బీ ఫలితాలు విడుదల
వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం డిగ్రీ, ఎల్.ఎల్.బి సెమిస్టర్‌ల పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ఆచార్య పుత్త్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య కె. కృష్ణారావు, సహాయ నియంత్రణ అధికారి డాక్టర్ కె. శ్రీనివాసరావుతో కలిసి విడుదల చేశారు. వైవీయూలోని తన చాంబర్లో ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్.ఎల్.బి (ఫైవ్ ఇయర్స్) రెండో సెమిస్టర్‌లో 113 మంది హాజరు కాగా 67 మంది ఉత్తీర్ణత సాధించారు. 59.29 శాతం నమోదయింది. నాలుగో సెమిస్టర్ లో 87 మంది హాజరు కాగా 9 మంది, ఆరో సెమిస్టర్ లో 79 మంది హాజరు కాగా 59 మంది, ఎనిమిదో సెమిస్టర్ లో 73 మంది పరీక్షకు హాజరు కాగా 53 మంది, పదో సెమిస్టర్ లో 122 మంది పరీక్ష రాయగా 108(88.52 శాతం) మంది పాసయ్యారని వెల్లడించారు.
ప్రారంభమైన క్యాన్సర్
నిర్ధారణ పరీక్షలు
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా ఎన్‌సీడీ3.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇంటింటి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. కడప నగరంలోని రాధాక్రిష్ణనగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహించిన కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు పైబడిన సీ్త్ర, పురుషులకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, రొమ్ము, నోరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పరీక్షలను ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహిస్తారని తెలిపారు. ఉచితంగా నిర్వహించే ఈ పరీక్షలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేష్, అర్బన్ నోడల్ ఆఫీసర్ ఉబేదుల్లా, డాక్టర్ సుమధుర, ఎంఓ ఖాజామెహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment