సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటా
ప్రొద్దుటూరు కల్చరల్: అక్రమ అరెస్టులు, నిర్భంధాలు, కేసులతో ఇబ్బంది పడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రమేష్‌యాదవ్ తెలిపారు. తనను, మేయర్ సురేష్‌బాబును కడప జిల్లా టాస్క్‌ఫోర్స్ ప్రతినిధులుగా నియమించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్సీ ధన్యవాదాలు తెలిపారు. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహా యం అందించడంతో పాటు తామున్నామనే భరోసా కల్పించి ఆత్మస్థైర్యాన్ని నింపుతామన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులను, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని భరోసా కల్పించారు.
ఎమ్మెల్సీ ఆర్.రమేష్‌యాదవ్
Comments
Please login to add a commentAdd a comment