ముందస్తు జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్ : ఉమ్మడి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులతో కడపలోని జిల్లా కోర్టు ఆవరణంలో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి ముందస్తు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబాఫకృద్దీన్తో పాటు, వైఎస్ఆర్ జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, డీఎస్పీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment