మానసిక, సామాజిక ఉన్నతికి గ్రంథాలయాల తోడ్పాటు
కడప కల్చరల్ : గ్రంథాలయాలు మనిషి మానసిక సామాజిక వికాసానికి ఎంతగానో తోడ్పడగలవని జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షి అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభను బుధవారం సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో నిర్వహించారు. తొలుత గ్రంథాలయ ఉద్యమకారుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాన్ని మించిన గురువు, మిత్రుడు మరొకరు ఉండరని అవి జీవితానికి అవసరమైన విలువలను నేర్పుతాయన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.అమీరుద్దీన్ కార్యదర్శి నివేదిక సమర్పించారు. సభాధ్యక్షుడు విద్యావేత్త అలపర్తి పిచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పుస్తక పఠనం మానవతా విలువలను నేర్పుతుందన్నారు. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచార్య జి.పార్వతి మాట్లాడుతూ సెల్‌ఫోన్ల వల్ల బాలలకు కీడే జరుగుతోందని, పుస్తక పఠనమే మంచి మార్గమని అభిప్రాయపడ్డారు. జిల్లా ఆడిట్ అధికారి పి.మంజులవాణి, వయోజన విద్యాధికారి మల్లు సుబ్బారెడ్డి మాట్లాడారు.
బహుమతి ప్రదానం
ఈ సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలలో వారం రోజులపాటు హైస్కూల్ విద్యార్థులకు నిర్వహించిన పలు రకాల పోటీలలో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. గ్రంథాలయ కార్యదర్శి అమీరుద్దీన్ ఆధ్వర్యంలో సిబ్బంది బాబ్జి, సుబ్రమణ్యం, పవన్ కుమార్, రాజ్ కుమార్, శ్రీనివాసచారి, మనోహర్ అతిథులను సత్కరించారు.పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ముగిసిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment