ఇసుక తీసుకెళ్తున్న వారిని అడ్డుకుంటున్న టీడీపీ నాయకులు
వేంపల్లె : ఇంటి అవసరాలకు ఇసుక తీసుకెళ్తున్న వారిని టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని గ్రామాల వారు ఇంటి అవసరాల కోసం ఇసుకను తీసుకెళ్లవచ్చని తహసీల్దార్ హరినాథ్ రెడ్డి సూచించారు. అయితే గ్రామ సచివాలయాలలో తమ ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తీసుకెళ్తున్నట్లు అర్జీ పెట్టుకోవాలన్నారు. వారికి సచివాలయ సిబ్బంది కూపన్ ఇస్తారని తెలిపారు. కాగా కూపన్ తీసుకొని వస్తున్న ట్రాక్టర్లను కూడా తీసుకెళ్లనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. బుధవారం ఉదయం పాపాఘ్ని నదిలో ఇసుకను తీసుకెళ్తున్న 10 ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో ఇసుకను తరలిస్తే తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడతామని సాకు చెబుతున్నారు. రాత్రివేళల్లో మాత్రం యథేచ్ఛగా టీడీపీ నాయకులు ఇసుకను తరలించడం గమనార్హం. వీరు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంటి అవసరాల కోసం లబ్ధిదారులు ఇసుకను తీసుకువెళ్లొద్దని అడ్డుకోవడం... రెవెన్యూ అధికారులకు పట్టించి జరిమానాలు విధించడం చేస్తున్నారని కొందరు ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment