ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు తెలిపారు.
● సాయంత్రం 6 గంటల తర్వాత చిన్నమండెం బస్టాండులోకి మదనపల్లె, పుంగనూరు బస్సులు రావడం లేదని స్థానికుడైన పెద్దిరెడ్డి తెలిపారు.
● కడప కార్గోలో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు బుకింగ్ సందర్భంగా విపరీతమైన రద్దీ దృష్ట్యా అదనపు బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని నగరానికి చెందిన రామయ్య, పెంచలయ్యకోరారు.
● సిద్దయ్యగారి మఠానికి బస్సులు నడవడం లేదని కడపకు చెందిన వెంకట చలపతి కోరారు.
● కమలాపురం బస్టాండులో బస్సుల సమయాలను ఏర్పాటు చేయాలని రాజేశ్వర్‌రెడ్డి కోరారు.
● ఉదయం 6.30 నుంచి 7.30 గంటల మధ్యలో వేంపల్లె–నందిమండలం నుంచి పులివెందులకు పల్లె వెలుగు బస్సులు ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాలకుచెందిన సతీష్, సుఫియాన్‌లు కోరారు.
● కడప–బెంగళూరు సర్వీసులను మదనపల్లె, చింతామణి బస్టాండుల మీదుగా నడపాలని, అలాగే బెంగళూరులోని సిల్క్ బోర్డు, యలహంక, వైట్ ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వరకు బస్సులు నడపాలని మదనపల్లెకు చెందిన సాయి శ్రీనివాస్ కోరారు.
● మైదుకూరు నుంచి ప్రొద్దుటూరుకు తిరుగుతున్న పల్లె వెలుగు బస్సులు అల్లాడుపల్లె దేవళాలు మీదుగా నడపాలని సీతారాంపురానికి చెందిన వెంకటేశ్వరరరెడ్డి కోరారు.
● బద్వేలు, జమ్మలమడుగు డిపోల నుంచి విజయవాడకు వయా పామూరు, కందుకూరు మీదుగా బస్సు ఏర్పాటు చేయాలని, అలాగే పులివెందుల, నూజివీడు సర్వీసును వయా పామూరు, కందుకూరు మీదుగా, పులివెందుల నుంచి ఒంగోలుకు వయా పామూరు, కందుకూరు మీదుగా, కడప నుంచి మైదుకూరు, పామూరు బస్సు సర్వీసును పునరుద్ధరించాలని పామూరుకు చెందిన విష్ణు, నరసింహారావులు కోరారు.
ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment