శాసనమండలిలో సీమ గళం
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి బుధవారం జరిగిన శాసనమండలి సమావేశంలో రాయలసీమ సమస్యలపై చర్చించారు. ఇందులో భాగంగా కర్నూలు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, విద్యుత్ రెగ్యులేటరీ సంస్థలను వేరే ప్రాంతానికి తరలిస్తున్న విషయంపై ప్రజల ఆందోళన చెందుతున్నారని ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. అలాగే జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం కర్నూలులో ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం 273 ఎకరాల్లో రూ.1000 కోట్లతో శంకుస్థాపన చేసిందన్నారు. ఆ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలపాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బి.కోడూరు : బి.మఠం మండలం రాణిబావి టోల్‌గేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో వెళ్లిబోయిన నారాయణ (45) అనే వ్యక్తి మృతి చెందగా పరమేశ్వర్ పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన వారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన నారాయణ, పరమేశ్వర్‌లు బుధవారం వ్యాపార నిమిత్తం మైదుకూరుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో రాణిబావి సమీపంలోని టోల్‌గేట్ దగ్గర బద్వేలు నుంచి మైదుకూరుకు అతివేగంగా వెళుతున్న లారీ వారిని ఢీకొంది. దీంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. పరమేశ్వర్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. నారాయణకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న నారాయణ మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భూసేకరణలో అక్రమాలపై జేసీ విచారణ
పోరుమామిళ్ల : బెంగళూరు – అమరావతి ( వయా అనంతపురం, శింగరాయకొండ) సిక్స్ వే ఎన్‌హెచ్167బీ జాతీయ రహదారి నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో అక్రమాలపై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ విచారణ చేపట్టారు. ఈమేరకు జరుగుతున్న పనులను పరిశీలించేందుకు బుధవారం ఆమె మండలానికి వచ్చారు. బొప్పాపురం, చెన్నారెడ్డిపేట, పేరమ్మగారిపల్లెతో పాటు బి.మఠం మండల పరిధిలో జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు రోడ్డు నిర్మాణంలో తమ భూములు పోయాయని, నష్టపరిహారం మాత్రం సిద్దు గురివిరెడ్డికి ఇచ్చారని జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరికొందరు తమకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. రైతుల ఫిర్యాదుతో జేసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు వాస్తవంగా కోల్పోయిన రైతుల వివరాలు తనకు పంపితే పరిహారం మంజూరు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ, తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
మరొకరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment