పర్మిట్ రూంలకు అనుమతి లేదు
ప్రొద్దుటూరు క్రైం : వైన్ షాపుల్లో కూర్చోబెట్టి మద్యం తాగిస్తే కేసులు నమోదు చేస్తామని ఉమ్మడి కడప జిల్లా డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ జయరాజ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని లిక్కర్ డిపోను బుధవారం ఆయన తనిఖీ చేశారు. గోడౌన్‌లోని లిక్కర్ నిల్వలను పరిశీలించారు. లిక్కర్, బీరు కేసులు ఎంతమేర స్టాకు ఉన్నాయని డీఎం తిమ్మనాయుడును అడిగి తెలుసుకున్నారు. పాత స్టాకును డీసీ పరిశీలించారు. మద్యం షాపులకు పంపించే లిక్కర్ విషయంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. డిమాండ్ బ్రాండ్లను కోటా ప్రకారం పంపిణీ చేయాలన్నారు. నిబంధనలు పాటించని మద్యం షాపులు, బార్లపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మద్యం షాపులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. పర్మిట్ రూంలకు అనుమతి లేదని, అక్కడే కూర్చోబెట్టి మద్యం తాగించే షాపులపై కేసులు నమోదు చేయాలన్నారు. బెల్ట్ షాపులు పెట్టకుండా రోజు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాలోని మద్యం షాపులకు పర్మినెంట్ లైసెన్సుల జారీ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. లైసెన్సుల జారీ సమయాన్ని గురువారం వరకు పొడిగించినట్లు డీసీ పేర్కొన్నారు. ప్రొద్దుటూరులోని మద్యం షాపుల్లో కల్తీకి ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు నాణ్యత పరీక్షలు నిర్వహించాలన్నారు.
మద్యం షాపులతో నష్టపోతున్నాం: డీసీకి మొరపెట్టుకున్న బార్‌ల నిర్వాహకులు
అనుమతి లేకున్నా మద్యం షాపుల్లో కూర్చోబెట్టి తాపుతున్నారని ప్రొద్దుటూరులోని బార్‌ల యజమానులు డీసీ జయరాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఎకై ్సజ్ స్టేషన్‌ను డీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా బార్ల యజమానులు డీసీని కలిసి మాట్లాడారు. అనుమతి లేకున్నా మద్యం షాపుల్లో బార్లను తలపించేలా టేబుళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఎన్నో సార్లు స్థానిక ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. అనధికార పర్మిట్ రూంల వల్ల రోజు వారి వ్యాపారం సగానికి పైగా పడిపోయినట్లు వారు డీసీ వద్ద వాపోయారు. రోజు రూ. 1.50 లక్షలు పైగా నష్టం వస్తోందని, సిబ్బందికి జీతాలు, రూంలకు బాడుగలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. వైన్ షాపుల చర్యలను నియంత్రించకుంటే బార్లను వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. దాడులు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని డీసీ వారికి హామీ ఇచ్చారు.
బెల్టుషాపులను అరికట్టాలి
ముద్దనూరు : బెల్టుషాపులు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక ఎకై ్సజ్ సర్కిల్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ మద్యం దుకాణాల్లో మాత్రమే మద్యం విక్రయించాలని, ఎక్కడైనా బెల్టుషాపులు నిర్వహిస్తే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఎకై ్సజ్ స్టేషన్ అద్దె భవనంలో కొనసాగుతున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
షాపుల్లో కూర్చోబెట్టి మద్యం తాగిస్తే
కేసులు నమోదు చేస్తాం
ఉమ్మడి కడప జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్
Comments
Please login to add a commentAdd a comment