కడప అగ్రికల్చర్: వేరుశనగ పంటకు సంబంధించి కదిరి లేపాక్షి(కె 1812) రకంతో రైతులు మంచి దిగుబడులను సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ వీరయ్య పేర్కొన్నారు. గురువారం ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ ఆహార భద్రత మిషన్‌లో భాగంగా సామూహిక ప్రథమ శ్రేణి క్షేత్ర ప్రదర్శన కింద జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలం ఇప్పపెంట గ్రామాన్ని, పెండ్లిమర్రి మండలం చెర్లోపల్లి, రామాపురం మండలం నల్లగుట్టపల్లె గ్రామ రైతులను ఎంపిక చేశారు. వీరు సామూహిక క్షేత్ర ప్రదర్శన కింద రబీలో కదిరి లేపాక్షి రకాన్ని సాగు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరుశనగ పంటకు సంబంధించి కదిరి లేపాక్షి(కె 1812) ఆకు మచ్చ తెగులు తట్టకుని పంట ఎత్తుగా పెరగకుండా ఎక్కువ కొమ్మలు పెరిగి ఎక్కువ ఊడలు వచ్చి కాయలు కూడా అధికంగా వస్తాయన్నారు. సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు సాయి మహేశ్వరి, మానస, మహేష్‌బాబు, సురేష్‌కుమార్‌రెడ్డి, గిరీష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment