ముగిసిన పెద్దదర్గా ఉరుసు
కడప కల్చరల్ : ప్రముఖ ఆధ్యాత్మిక, సూఫీ క్షేత్రమైన కడప అమీన్‌పీర్ (పెద్ద) దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు గురువారం ముగిశాయి. బుధవారం రాత్రి ప్రారంభమైన దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నగరోత్సవం తెల్లవారుజాము వరకు కొనసాగింది. అనంతరం దర్గాలో ప్రముఖ గాయకులతో ఖవ్వాలీ కచేరి నిర్వహించారు. గురువారం ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు బండారు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సమస్యలను పీఠాధిపతి ప్రత్యేకంగా ఆలకించి పరిష్కారాలు సూచించారు. వారు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేశారు. పెద్ద ఉరుసుఉత్సవాలు వారం రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, భక్తులకు ఆయన అభినందించారు. ఉత్సవాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించారు.
పెద్దదర్గాలో ప్రముఖుల ప్రార్థనలు
కడప అమీన్‌పీర్ దర్గాకు నేడు కూడా భక్తులు, అతిథుల రాక కొనసాగింది. గురువారం కూడా భక్తులు విశేష సంఖ్యలో ప్రధాన గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ, సతీమణి నారాయణమ్మ, నాయకులు ఆంజనేయులు, సుబ్బయ్య, నాగభూషణంలతో కలిసి వచ్చి దర్గాలోప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా మత సామరస్యానికి మారుపేరుగా నిలువడం ఈ ప్రాంత గొప్పతనాన్ని తెలుపుతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment