రక్తదానం చేయడం సామాజిక బాధ్యత
వైవీయూ : రక్తదానం చేయడం సామాజిక బాధ్యత అని 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సత్యనారాయణమూర్తి అన్నారు. శుక్రవారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి)లో ఎన్‌సీసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ మాట్లాడుతూ ఎన్‌సీసీ దినోత్సవ వేడుకల్లో భాగంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. రవీంద్రనాథ్ మాట్లాడుతూ మనం చేసే రక్తదానం రక్తం, ప్లాస్మా, ప్లేట్లేట్ వంటి వివిధ రూపాల్లో ఆపదలో ఉన్న వ్యక్తుల ప్రాణాలను నిలబెడుతుందన్నారు. ఎన్‌సీసీ అధికారులు లెఫ్టినెంట్ డాక్టర్ ఆర్. నీలయ్య, డా. మహేష్ మాట్లాడుతూ ఎన్‌సీసీ వేడుకల్లో భాగంగా కేడెట్స్ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎన్‌సీసీ ‘సి’, ‘బి’ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఎన్‌సీసీ కేడెట్స్‌కు సర్టిఫికెట్లు అతిథులు చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో రిమ్స్ బ్లడ్ బ్యాంకు అధికారి డాక్టర్ రాజేంద్ర, సుబేదార్ మేజర్ అనిల్‌కుమార్, అధ్యాపకులు డా. సురేష్‌బాబు, డా. ఎ. నాగరాజు, రెడ్డిబాషా, పరీక్షల నియంత్రణాధికారి డా. రామకృష్ణ, ఎన్‌సీసీ కేడెట్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment