దౌర్జన్యకారులపై చర్యలు తీసుకోండి
బద్వేల్ వ్యవసాయం : తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఇంటి స్థలాన్ని, అందులో నిర్మించుకున్న రేకుల షెడును ఇద్దరు విలేకర్లు రెండు రోజుల కిందట దౌర్జన్యంగా ఆక్రమించుకుని విద్యుత్ మీటరును కూడా ఏర్పాటు చేసుకున్నారు. వారి నుంచి మా స్థలం విడిపించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బద్వేల్ పట్టణం గాంధీ నగర్ చెందని మహిళ జి.సుబ్బరత్నమ్మ శుక్రవారం జిల్లా కేంద్రమైన కడపలో కలెక్టర్, ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోపవరం మండల పరిధిలోని మడకలవారిపల్లె గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 952లో ప్లాట్ నెంబర్ 146 హెచ్‌ఎస్ నెంబర్ 267/91 లో 0.08 సెంట్లు ఇంటి స్థలం నాభర్త గల్లా రామిరెడ్డి పేరున 2022లో రాజంపేట నివాసి షేక్ జాఫర్ మియ్యా కుమారుడు షేక్ ఖలీల్‌బాషా నుంచి కొనగోలు చేశామని తెలిపారు. కొనుగోలు చేసిన సమయంలోనే అందులో రేకుల షెడ్డు కూడా వేశామన్నారు. అయితే రెండు రోజుల క్రితం బద్వేల్‌కు చెందిన ఇద్దరు పత్రికా విలేకర్లు ఎన్‌జిఓ కాలనీలోని మా స్థలాన్ని ఆక్రమించి అందులో విద్యుత్ మీటరు కూడా బిగించి ప్రహరి కూల్చివేశారని బాధితురాలు వాపోయింది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఇది సివిల్ పంచాయతీ తహసీల్దారు వద్దకు వెళ్లమన్నారని తెలిపింది. అక్కడ తహసిల్దార్ లేకపోవడంతో కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సుబ్బరత్నమ్మ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment