వైభవంగా హజరత్ ఖాదర్‌వలీ దర్గా ఉరుసు
నందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, అరవపల్లి గ్రామంలోని రైల్వే జామా మసీదు ప్రాంగణంలో వెలసిన హజరత్ ఖాదర్ వలీ 132వ ఉరుసు ఉత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు. దర్గా కమిటీ ప్రెసిడెంట్ కమాల్ బాషా దర్గా విశిష్టతను వివరించారు.
జనాబ్ ఎస్టీ ఖాన్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ వైస్ ప్రెసిడెంట్ సమీఉల్లాఖాన్, సెక్రటరీ కరీముల్లా, ట్రెజరర్ సయ్యద్ అమీర్, గొబ్బిళ్ల త్రినాథ్, అరిగెల సౌమిత్రి, గడికోట వెంకటసుబ్బారెఢ్డి, వైస్ ఎంపీపీ అనుదీప్, మండల కో–ఆప్షన్ సభ్యుడు కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment