లక్ష్యం వైపు పదిపదమంటూ..!
స్టడీ అవర్స్‌తో ఎంతో ఉపయోగం
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ను నిర్వహించడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది. రివిజన్ తో బాగా గుర్తుండి పోతుంది.
– సాయి ప్రణీత, పదవ తరగతి విద్యార్థి
పిల్లల బంగరు భవితకు ‘పది’ పునాది.. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి అడుగది. అవును.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాధించాల్సిన లక్ష్యాల కోసం ‘పది’పదమంటూ విద్యార్థులను పరుగులు పెట్టిస్తున్నారు అధికారులు. ఈ సారి వందశాతం ఉత్తీర్ణత సాధన కోసం ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక
తరగతులు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం రూపొందించాం. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. – లెక్కల జమాల్‌రెడ్డి,
ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, ఒంటిమిట్ట
పకడ్బందీగా ప్రణాళిక అమలు
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయులకు మేము తగిన సూచనలు, సలహాలను ఇస్తున్నాం. అందరి సమిష్టి కృషితో మంచి ఫలితాలసు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– మీనాక్షి, జిల్లా విద్యాశాఖ అధికారి
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో డిసెంబర్ నెల నుంచి మార్చి వరకు వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2025 సంవత్సరం మార్చి 17 నుంచి మార్చి 31 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇటీవల విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 593 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 27,833 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేలా ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు.
అదనపు తరగతుల నిర్వహణ..
వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం ఒక సబ్జెక్టు, సాయంత్రం మరో సబ్జెక్టు చదివిస్తున్నారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదివిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్ష నిర్వహించి వారి ప్రతిభను అంచనా వేస్తున్నారు. పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న వారు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టుల్లో వెనుబడి ఉన్నారని గమనిస్తూ వారిలో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసం నింపేలా కృషి చేస్తున్నారు.
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలసాధనకు వంద రోజుల ప్రణాళిక
విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్
Comments
Please login to add a commentAdd a comment