సహజ సామర్థ్యాలకు మరింత పదును | - | Sakshi
Sakshi News home page

సహజ సామర్థ్యాలకు మరింత పదును

Published Sun, Dec 22 2024 12:29 AM | Last Updated on Sun, Dec 22 2024 12:29 AM

సహజ సామర్థ్యాలకు మరింత పదును

సహజ సామర్థ్యాలకు మరింత పదును

కడప ఎడ్యుకేషన్‌ : ప్రధానోపాధ్యాయుల్లో ఉండే సహజ సామర్థ్యాలకు నాయకత్వంలో మరింత పదును పెట్టేందుకే ప్రభుత్వం లీడర్‌ షిప్‌ శిక్షణను ఇస్తోందని డిప్యూటీ ఈఓ రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కడప నగర శివార్లలోని గీతమ్స్‌ కాలేజీలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న లీడల్‌ షిప్‌–2 శిక్షణ శనివారంతో ముగిసింది. ఈ శిక్షణను ఏపీ స్టేట్‌ ఇన్‌స్టిస్ట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణలో జిల్లా వ్యాప్తంగా 562 మంది ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సమావేశంలో డిప్యూటీ ఈఓ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు సమర్థవంతంగా నిర్వహించాలంటే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తప్పని సరిగా దృఢమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలన్నారు. తద్వారా పాఠశాల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు వారే సత్వరం పరిష్కరించుకోగలరన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్లు వెంకటరామిరెడ్డి, విజయరెడ్డి, దశరథరామిరెడ్డి, కేశవరెడ్డి, రామాంజనేయరెడ్డి, విశ్వనాథరెడ్డి, మాస్టర్‌ ఫెసిలిటేటర్స్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement