ఉజ్వల భవిష్యత్తు నిర్మాణానికి వేదిక విశ్వవిద్యాలయం
వైవీయూ : కన్నవారి ఆకాంక్షలను నెరవేర్చి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకునేందుకు విద్యార్థులకు యోగివేమన విశ్వవిద్యాలయం చక్కటి జ్ఞాన కేంద్రం అని విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ ఆచార్య కె. కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం వైవీయూలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇండక్షన్ (ప్రేరణ) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఫ్యాకల్టీ, విలువైన పుస్తక నిధి కలిగిన లైబ్రరీ విశ్వవిద్యాలయంలో ఉందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత విశ్వవిద్యాలయంల్లో వైవీయూ ఒకటన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పీజీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి మాట్లాడుతూ గొప్ప స్థాయిల్లో ఉన్నవారంతా రోజుకు 18 గంటలు శ్రమించినవారేనని గుర్తుచేస్తూ వారిని అనుసరించాలన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన రాజంపేట స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పసుపులేటి శంకర్ ప్రసంగిస్తూ గురువు మందలిస్తున్నాడంటే మిమ్ములను ఉన్నతంగా మలుస్తున్నాడని భావించాలన్నారు. చిన్మయ మిషన్ అధ్యక్షుడు స్వామి తురియానంద మాట్లాడుతూ మైండ్ మేనేజ్‌మెంట్ తెలిసిన వారే ముందుంటారన్నారు. స్వామి వివేకానంద చికాగో ఉపన్యాసం గుర్తచేస్తూ ఆయన మార్గం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. తైక్వాండో శిక్షణా నిపుణులు మాస్టర్ ఎం.నాగూర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు దీపంలాంటివారు ఇతరులకు వెలుగులు ఇవ్వాలని కోరారు. వ్యాయామ క్రీడల శాస్త్ర సంచాలకులు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి సభా సమన్వయం చేశారు. సాంస్కృతిక విభాగం సంచాలకులు ఆచా ర్య జి. విజయభారతి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
వైవీయూ ఇండక్షన్ ప్రోగ్రాంలో వైవీయూ వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment