నేటి నుంచి ఈశ్వరీదేవి మఠంలో ఆరాధనోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం సమీపంలో ఉన్న మాతా ఈశ్వరీదేవి మఠంలో ఆదివారం నుంచి 27వ తేదీ వరకు ఈశ్వరీదేవి అమ్మవారి ఆరాధన ఉత్సవాలకు సర్వ సిద్ధం చేశారు. ఈమేరకు మఠం ఈఓ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మంగారి కుమారుడు గోవిందస్వామి, గిరియబం దంపతులకు జన్మించిన ఈశ్వరీదేవి 1789లో బ్రహ్మంగారిమఠం సమీపంలో సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి అమ్మవారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు అమ్మవారి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, కర్నాటక, తమిళనాడు నుంచి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment