జగన్‌మోహన్‌రెడ్డి ధీరత్వాన్ని చిత్రించిన తవ్వా
మైదుకూరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీవితాన్ని ‘ఓ ధీరుడి పయనం’ పేరుతో పుస్తకం రాసిన రచయిత తవ్వా వెంకటయ్య.. జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన ధీరత్వాన్ని చిత్రించాడని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మైదుకూరులో శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార భాషా సంఘం మాజీ సభ్యుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య రాసిన ‘ఓ ధీరుడి పయనం’ పుస్తకాన్ని రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట పట్టింపుతో పార్టీని స్థాపించిన వాడు, పోరాటాలతో పార్టీని నడిపిన వాడు, ప్రజాభిష్టంతో పార్టీని గెలిపించినవాడు, ప్రజల కోసం పాలించిన వాడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ పుస్తకం జగన్‌మోహన్‌రెడ్డి జీవితానికి అద్దం పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రభుత్వ మాజీ సలహాదారు ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మైదుకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణరెడ్డి, చాపాడు, దువ్వూరు బి.మఠం ఎంపీపీలు లక్ష్మయ్య, జయచంద్రారెడ్డి, వీరనారాయణరెడ్డి, మైదుకూరు వైస్ ఎంపీపీ రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment