ఓవరాల్ చాంపియన్ ‘కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్’
కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2024–25 ఘనంగా ముగిశాయి. ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ పోటీలలో ఉమ్మడి కడపజిల్లాలోని 14 పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, డిస్క్‌త్రో, బ్యాడ్మింటన్, పరుగుపందెం, ఖో ఖోలను నిర్వహించారు. ఈ పోటీలలో ఇండ్యూజువల్ చాంపియన్స్‌గా పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతోపాటు కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు నిలిచారు. దీంతోపాటు ఓవరాల్ చాంపియన్స్‌గా కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు నిలిచారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థినిలకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరం అన్నారు. అనంతరం విజేతలకు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతితో కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment