నేడు 19 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు | - | Sakshi
Sakshi News home page

నేడు 19 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

Published Mon, Dec 23 2024 12:59 AM | Last Updated on Mon, Dec 23 2024 12:59 AM

-

కడప సెవెన్‌రోడ్స్‌: భూ సమస్యల పరిష్కారానికి సోమ వారం జిల్లాలోని 19 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. బద్వేల్‌ రెవెన్యూ డివిజన్‌ లోని అట్లూరు మండలం యస్‌.వెంకటాపురం, బి.కోడూరు మండలం మేకవారిపల్లి, బి.మఠం మండలం బూదవాడ, బద్వేల్‌ మండలం కోనసముద్రం, గోపవరం మండలం లక్కవారిపల్లి, కలసపాడు మండలం రాజుపాలెం, మైదుకూరు మండలం వనిపెంట, పోరుమామిళ్ల మండలం గానుగపెంట, పులివెందుల రెవిన్యూ డివి జన్‌లోని పులివెందుల మండలం కె .వెలమవారిపల్లి, వీఎన్‌ పల్లి మండలంలో లింగాల, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్‌లోని దేవగుడి, కొండాపురం మండలంలో కోనవారిపల్లి, మైలవరం మండలంలోని యం.కంబలదిన్నె, రాజుపాలెం మండలం అర్కటవేముల, కడప రెవెన్యూ డివిజన్‌లోని సీకే దిన్నె మండలం మామిళ్లపల్లె, ఖాజీపేట మండలం చెన్నముక్కపల్లి, పెండ్లిమర్రి మండలం గొందిపల్లె, వల్లూరు మండలం పెద్దపుత్త గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయని డీఆర్వో వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement