రిమ్స్‌లో అడిషనల్ డీఎంఈ పర్యటన
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల (రిమ్స్) ఆవరణలో శుక్రవారం అడిషనల్ డీఎంఈ (అకడమిక్) డాక్టర్ వెంకటేశ్వరావు పర్యటించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, వైద్య కళాశాల, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మానసిక వైద్యశాల, కేన్సర్ హాస్పిటల్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం వైద్యకళాశాలలోని కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక విభాగాల హాస్పిటల్స్‌లలో పని చేస్తున్న సిబ్బంది కొరతపై ఆరా తీశారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందిలో కొంత మందిని ప్రత్యేక విభాగాల ఆసుపత్రులలో నియమించుకుని విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు. మూడు ప్రత్యేక ఆసుపత్రులలో రోగులకు సక్రమంగా వైద్య సేవలను అందించేలా అవసరమైన సిబ్బంది వివరాలకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ, కడప రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సురేఖ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, ఆర్‌ంఎంఓ డాక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment