కడపలో చేపట్టిన టెండర్లు ఏకపక్షంగా చేపట్టారని అసలు టెండర్లల్లో పాల్గొనే అవకాశమే లేకుండా చేశారని, డీడీని కలిస్తే గడువు ముగిసిందని చెబుతున్నారంటూ ఆయా కాంట్రాక్టర్లు భీమవరంలోని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖనాయకుడు కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్‌తో ఫోన్‌లో వాకబు చేసినట్లు సమాచారం. టెండరు దాఖలు చేయడానికి వచ్చిన వారు డీడీ కార్యాలయంలోనే ఉన్నారని తెలియజేసినట్లు సమాచారం. ఏకపక్షంగా టెండర్లు ఎలా నిర్వహిస్తారంటూ నిలదీసినట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన కలెక్టర్ మత్స్యశాఖ డీడీ నాగరాజును ఆరా తీశారు. ఆపై అసలు విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. వెంటనే టెండర్లు వాయిదా వేయాలంటూ కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. కాగా, ఈవిషయమై ఇన్‌చార్జీ డీడీ నాగరాజు వివరణ కోరగా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అందుబాటులో లేకపోవడంతోపాటు కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్లను వాయిదా వేశామని తెలియజేశారు. టెండర్లలో పాల్గొనేందుకు వచ్చిన వారు ఇబ్బందులు పడినట్లు.. కిడ్నాప్‌కు గురైనట్లు అధికారికంగా తన దృష్టికి రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment