మత్స్య సంపద పెంపొందించేందుకు చేపట్టిన టెండర్లు తాత్కాలి
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లా మత్స్యశాఖ పరిధిలోగల చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపకానికి అధికారులు టెండర్లు పిలిచారు. సోమశిల, గండికోట, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లులో 40లక్షల చేప పిల్లలు విడిచేందుకు టెండర్లను ఆహ్వానించారు. తక్కువ రేటు కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేయనున్నారు. కాగా రాయలసీమ ప్రాంతంలో టెండరు లైసెన్సుదారులు చాలా అరుదుగా ఉన్నారు. రాష్ట్రంలోని కై కలూరు, భీమవరం ప్రాంతాల నుంచి టెండరుదారులు టెండరు వేసేందుకు కడపలోని కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఓ టీడీపీ నాయకుడి నేతృత్వంలో ఆ యా ప్రాంతాలకు చెందిన వా రిని టెండర్లో పాల్గొనకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. జిల్లా టీడీపీ ముఖ్యనేతల పేర్లు చెబుతూ బెదిరింపులకు దిగారు. ఏకంగా రహస్య ప్రాంతానికి తరలించి టెండర్ గడువు ముగిసేంత వరకూ అదుపులో పెట్టుకున్నట్లు సమాచారం. ఆపై టీడీపీకి అనువైన రెండు టెండర్లు చివరి నిమిషంలో దాఖలు చేశారు. సింగిల్ టెండర్ కాకుండా జాగ్రత్త పడ్డారు. టెండర్ గడువు ముగిసిన తర్వాత భీమవరం, కై కలూరు ప్రాంతాలకు చెందిన వారిని వదిలిపెట్టారు. వారు కార్యాలయానికి చేరుకొని టెండర్ దాఖలు చేసేందుకు ఇన్‌ఛార్జీ డీడీ నాగరాజును కోరగా అప్పటికే టెండర్ గడువు ముగిసిందని జవాబు వచ్చింది.
మత్స్యశాఖ టెండర్లు వాయిదా!
స్థానికి టీడీపీ నేతలవ్యూహం బెడిసికొట్టిన వైనం
కాంట్రాక్టర్లు కిడ్నాప్...గడువు ముగిశాక విడుదల
అనివార్యకారణాల వల్ల టెండరు వాయిదా వేశామని డీడీ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment