బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి
కడప కల్చరల్: తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం ఆలయ నిర్వాహకులు, అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బ్రహ్మోత్సవాల నిర్వహణ గురించి టీటీడీ అధికారులు, అర్చకులతో బ్రహ్మోత్సవాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
ఉత్సవాలు ఘనంగా...
అనంతరం ఆయన ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణకుగల అనుకూలాలు, ప్రతికూలాలను గురించి అధికారులతో మాట్లాడారు. ఆలయంలో జనవరి 1న, వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని, ఆ తర్వాత రానున్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాల అలంకరణ, క్యూలైన్లు, భక్తులకు తాగునీరు, ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రసాద వితరణ చేయాలని సూచించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రతిరోజు భక్తులు దాతల సాయంతో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదానం గురించి భక్తులకు తెలిసేలా ఆలయం వెలుపల పెద్దపెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రథోత్సవం రోజు ప్రత్యేకంగా భక్తులకు ఏమాత్రం కొరత లేని విధంగా మంచినీరు, ప్రసాదం అందుబాటులో ఉంచాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఆలయ డీపీ డిప్యూటీవో నరేష్ బాబు ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు
టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం
Comments
Please login to add a commentAdd a comment