హోరాహోరీగా బండలాగుడు పోటీలు
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కామనూరు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన సీనియర్ క్యాటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రారంభించారు. ఇందులో 11 జతల ఎద్దులు పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌కు చెందిన సుంకి సురేంద్రరెడ్డి ఎద్దు, నంద్యాల టౌన్ పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి కేశవరెడ్డికి చెందిన ఎద్దు కలసి పోటీలో పాల్గొని 3,643.09 అడుగుల దూరం బండ లాగి ప్రథమ స్థానంలో నిలిచి బుల్లెట్ ద్విచక్రవాహనాన్ని కై వసం చేసుకున్నాయి. మైదుకూరుకు చెందిన కుర్రా వెంకటేష్ యాదవ్ ఎద్దులు 3,260.02 అడుగుల దూరం బండ లాగి రెండో స్థానంలో నిలిచి టీవీఎస్ అపాచి ద్విచక్రవాహనాన్ని గెలుపొందాయి.
ప్రొద్దుటూరు మండలం చౌటపల్లెకు చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎద్దులు మూడో స్థానంలో నిలిచి టీవీఎస్ స్పోర్ట్స్ ద్విచక్రవాహనం, ప్రొద్దుటూరుకు చెందిన ద్వార్శల గురివిరెడ్డి ఎద్దులు నాలుగో స్థానంలో నిలిచి టీవీఎస్ ఎక్సెల్, గుంటూరు జిల్లా కుంచనపల్లికి చెందిన పులగం త్రిష్ణారెడ్డి ఎద్దులు ఐదో స్థానంలో నిలిచి రూ.25వేలు నగదు బహుమతి అందుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన మార్తల చంద్ర ఓబుళరెడ్డి ఎద్దులు ఆరో స్థానంలో నిలిచి రూ.15వేలు నగదు, మిగిలిన ఎద్దుల జతలకు కన్సొలేషన్ బహుమతి కింద ఒక్కో కాడికి రూ.5,116 గ్రామ కమిటీ ప్రతినిధులు అందజేశారు. ఈ ఎద్దుల పోటీలో యాంకర్లుగా ఓగేటి సురేంద్ర, చిరంజీవి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment