ఆ ముగ్గురు...
రాజంపేట : ఉభయ జిల్లాలో ప్రత్యేకస్థానం కలిగిన పార్లమెంట్ కేంద్రమైన రాజంపేటలో ఇక బ్యూరోక్రాట్స్ పరిపాలన కొనసాగనుంది. ఇక్కడ రాజ్యాంగం, చట్టం సక్రమంగా అమలుకానుందని, అవినీతి, అక్రమాలకు తావులేకుండా చేస్తారని..పేదలకు మేలు జరుగుతుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న డివిజన్ ఫారెస్టు కార్యాలయం జిల్లా అటవీశాఖ కార్యాలయంగా రూపుదిద్దుకుంది. బ్రిటీషు కాలం నుంచి రాజంపేటలో ఐఏఎస్ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో జిల్లా పాలనహోదాతో ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ కలిగిన అధికారులతో ఇక్కడ కొత్త పుంతలు తొక్కనుంది. ఆ దిశగా జిల్లా హోదా కొనసాగుతుందని ఆశలు పుట్టుకొచ్చాయి.
జిల్లా హెడ్‌క్వార్టర్‌లా పీలింగ్స్
ఒక రకంగా రాజంపేట వాసుల్లో జిల్లా హెడ్‌క్వార్టర్ అన్న ఫీలింగ్ కలుగుతోంది. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేట, రాయచోటి, మదనపల్లె సభల్లో తన దైనశైలిలో జనాన్ని నమ్మించేలా ఒక్కోచోట ఒక్కో రకంగా జిల్లా కేంద్రం చేస్తామని హామీలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్వివిభజనకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌స్నిగల్ ఇచ్చింది. మరో 50నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. పూర్వపు జిల్లాకే రాజంపేట నియోజకవర్గం వెళ్లనుందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు.
రెవెన్యూలో ఐఏఎస్ పాలన...
బ్రిటీషు కాలం నుంచి ఐఏఎస్‌పాలన ఉన్నప్పటికీ రాజంపేటకు అదే కొత్తేమి కాదు. ఇక్కడ ఐఏఎస్‌గా తొలిపోస్టింగ్ చేసిన వారు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా వరకు వెళ్లారు.1915 నుంచి రాజంపేట సబ్‌కలెక్టరేట్ ఉండేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ అంతకముందు నుంచి బ్రిటీషు రెవెన్యూ పాలన కొనసాగింది. ఇప్పటికీ తెల్లదొరల రెవెన్యూ పాలనకు సబంధించి భవనాలు ఇక్కడ కనిపిస్తాయి.
రెవెన్యూ పాలన చేసిన ఐఏఎస్‌లు..
1953 నుంచి రాజంపేట డివిజన్ కేంద్రంగా కె.రామచంద్రన్, ఎంఆర్‌పాయ్, టీఎల్ శంకర్, డీ.ఆరోరా, ఎ.వల్లపన్, శ్రీరామచంద్రమూర్తి, ఎంఎస్‌రాజాజీ, సీఎస్ రంగాచారి,ఎస్,బాలకష్ణ, బాబురాం, అశోక్ కుమార్ గోయల్, జానకి కృష్ణమూర్తి, శర్మారావు సబ్‌కలెక్టర్లుగా ఉన్నారు. 1978 నుంచి మిన్నీమాథ్యుస్, ఎంహెచ్‌డీ సఫీక్యూజ్‌జామన్,రణదీప్‌సదన్, ఏసీ పునీత, అజయ్‌జైన్, ప్రీతీమీనా, కేతన్‌గార్గ్ తదితరులు సబ్‌కలెక్టర్లుగా పనిచేశారు.తాజాగా వైఖోమా నైదియాదేవి సబ్‌కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మూడున్నర దశాబ్దాల తర్వాత ఐపీఎస్ హోదా కలిగిన అధికారి చేతుల్లోకి ఖాకీపగ్గాలు వెళ్లాయి. ఉభయ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలైన పులివెందుల, జమ్మలమడుగులో ఐపీఎస్ క్యాడర్ కలిగిన వారిని పోలీసు అధికారులుగా నియమించారు. అయితే ప్రశాంతతకు నిలయమైన రాజంపేటలో ఐపీఎస్‌హోదా కలిగిన అధికారిని నియమించడంతో త్వరలో రాజంపేటను జిల్లాకేంద్రంగా చేస్తారా అన్న ఆశలు జనంలో చిగురిస్తున్నాయి.
చేయాల్సినవి..
ఐఏఎస్ పరంగా.. రెవెన్యూ సబ్ డివిజన్ లో ప్రధానగా భూ వివాదాలు ఉన్నాయి. మండల రెవెన్యూ పాలన గాడిలో పెట్టాలి, పీజీఆర్‌ఎస్‌లో వచ్చే వినతులు పరిష్కారంలో కిండి స్థాయి అధికారుల్లో నిర్లక్ష్యం వీడేలా చేయాలి. రాజంపేట మండలంలో పట్టాదారు పుస్తకాలు త్వరగా ఇవ్వడం లేదు, భూ సమస్యలు పరిష్కారానికి ప్రతేక చర్యలు అవసరం.
● ఐపీఎస్ పరంగా మన్నూరు అప్‌గ్రేడ్ స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు భర్తీ చేయాలి, రాజంపేటటౌన్‌లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసుశాఖ, ఆర్‌అండ్ బీ, ఆర్టీసీ సమన్వయంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలి. కళాశాలలకు నిలయమైన బోయినపల్లి ప్రాంతంలో పోలీసు అవుట్ పోలీస్ స్టేషన్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలి. రాజంపేట పాత బస్టాండ్ లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరించాలి, రాజంపేట టౌన్, బోయనపల్లిలో నైట్ బీట్ పెంచాలి, రోడ్ ప్రమాద నివారణ చర్యలు పటిష్టం చేయాలి, నిఘానేత్రాల వ్యవస్థను పటిష్టం చేయాలి. రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో మద్యం అమ్మకాల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి, రాజంపేట ఏరియా హాస్పిటల్ లో ఔట్ పోస్ట్ నిరంతరం పని చేసేలా చేయాలి.
● ఐఫ్‌ఎస్ పరంగా నగర వనాలు అందుబాటులోకి తీసుకురావాలి, రాజంపేట రాయచోటి రోడ్డులోని రెడ్ వుడ్ జంగిల్ సఫారీని పునరుద్ధరించాలి. కడప– రేణిగుంట హైవే లోని రామాపురం చెక్ పోస్ట్‌లో సీసీ కెమెరాల వ్యవస్థను పునరుద్ధరించాలి, ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టదిశగా చర్యలు చేపట్టాలి, సోమశిల బ్యాక్ వాటర్ లో ఎకో టూరిజంను తీసుకురావాలి.
జగన్నాథసింగ్, ఐఎఫ్‌ఎస్
వైఖోమా
నైదియాదేవి
మనోజ్‌రామ్‌నాథ్‌హెగ్డే, ఐపీఎస్
రాజంపేట సబ్‌కలెక్టర్‌గా వైఖోమానైదియాదేవి, పోలీసుశాఖకు సంబంధించి ఏఎస్పీగా మనోజ్‌రామ్‌నాఽథ్‌హెగ్డే, జిల్లా అటవీశాఖాధికారిగా జగన్నాథ్‌సింగ్‌లు నియమితులయ్యారు. ఈమూడు శాఖలు కూడా కీలకమైనవే. కూటమిపాలనలో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ఇందుకు ఇటీవల పట్టుబడిన సంఘటనలే నిదర్శనం. అలాగే రెవెన్యూపరంగా భూవివాదాలు ఆరునెలల్లో అధికమయ్యాయి. పోలీసుశాఖ తన విధులు మరిచి రాంగ్‌రూట్‌లో సేవలందిస్తోందన్న అపవాదును మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు శాఖలకు జిల్లా హోదా కలిగిన ఉన్నతాధికారులే పాలన సాగిస్తున్న తరుణంలో వీరు ఏమేరకు పనితీరు కనబరుస్తారన్నది వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment