నూతన ఎస్పీగా ఈ.జి. అశోక్‌కుమార్
కడప అర్బన్ : జిల్లా నూతన ఎస్పీగా ఈ.జి. అశోక్‌కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. సుమారు రెండున్నర నెలల తర్వాత జిల్లాకు కొత్త ఎస్పీ రానున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఇన్‌ఛార్జ్ ఎస్పీగా కొనసాగారు. కాగా, ఇటీవల అదనపు ఎస్పీ నుంచి ఎస్పీగా పదోన్నతి పొందిన కొందరిలో ఈ.జి అశోక్‌కుమార్ ఒకరు. ఈయన గతంలో కడప డీఎస్పీగా పనిచేశారు.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కడప రూరల్: వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయకర్త ఉదయశ్రీ కోరారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు, ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థు లు దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్స్ నకళ్లను ఒక సెట్ జతపరిచి ఈనెల 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు కలెక్టరేట్ డి–బ్లాక్‌లో గల ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యాలయంలో స్వయంగా అందజేయాలని పేర్కొన్నారు. అలాగే 23వ తేదీన కడప చిన్న చౌక్ గురుకుల పాఠశాలలో నిర్వహించే ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌తోపాటు డెమో ఇంటర్వ్యూకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment