ఆరోగ్యమే మహాభాగ్యం
కడప అర్బన్ : పోలీసు శాఖలో సాయుధ బలగాల విభాగం (ఏ.ఆర్) కీలకపాత్ర పోషింస్తుందని, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు సూచించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఏ.ఆర్ సిబ్బందికి నిర్వహిస్తున్న మొబిలైజేషన్‌లో భాగంగా సోమవారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో శిక్షణా తరగతుల్లో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు పాల్గొన్నారు. సిబ్బంది తమ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చన్నారు. యోగా, ధ్యానం, వ్యాయా మం చేయడం దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలన్నారు. ఏ.ఆర్ సిబ్బంది ఆయుధాల వినియోగం, నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. బందోబస్తు విధుల్లో పలు మెలకువలను సిబ్బందికి అదనపు ఎస్పీ (అడ్మిన్) వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య, ఆర్‌ఐలు ఆనంద్, శివరాముడు, శ్రీశైలరెడ్డి, వీరేష్, టైటస్, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.
ఏఆర్ సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మెరుగైన ఆరోగ్యంతోనే సమర్థవంతమైన విధులు
యోగా, వ్యాయామం దినచర్యలో
భాగంగా చేసుకోవాలి
జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment